close

తాజా వార్తలు

Updated : 28/01/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నట్టేటముంచేలా పీఆర్‌సీ నివేదిక: బండి సంజయ్‌

హైదరాబాద్‌: పీఆర్‌సీపై సీఆర్‌ బిస్వాల్‌ కమిటీ సమర్పించిన నివేదికపై అభిప్రాయ సేకరణకు సీఎం కేసీఆర్‌ తనకు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాలనే పిలుస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అనుకూల ఉద్యోగ సంఘాలతో చర్చించి, పాలాభిషేకం చేయించుకోవాలని సీఎం తాపత్రయపడుతున్నారని ఆక్షేపించారు. ఈ మేరకు బండి సంజయ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగ, పింఛనుదారులు, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలను భాగస్వాములను చేసి అభిప్రాయసేకరణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలోని ఉద్యోగులను నట్టేటముంచేలా పీఆర్‌సీ కమిటీ నివేదిక ఉందని బండి సంజయ్‌ విమర్శించారు. 7.5శాతం ఫిట్‌మెంట్‌ను తెరపైకి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు ప్రస్తావన రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఒక ప్రణాళిక ప్రకారమే త్రిసభ్య కమిటీ పేరుతో ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2014లో ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని.. ఉద్యోగులకు కల్పించాల్సిన ఈహెచ్‌ఎస్‌ అమలు కావడం లేదని పేర్కొన్నారు. కరోనా బాధిత ఉద్యోగులకు రూ.లక్ష సాయం చేస్తామని చెప్పి చేతులు దులుపుకొన్నారని.. కరోనా బారినపడ్డ ఉద్యోగులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుని అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్జీవోలకు ఎల్‌టీసీ లేకుండా పోయిందని, భార్యాభర్తల బదిలీలు ఇంకెప్పుడని ప్రశ్నించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై గొంతెత్తే వాళ్ళను కేసుల పేరుతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు భాజపా అండగా ఉంటుందని.. వాళ్ళను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని సంజయ్‌ హెచ్చరించారు.

ఇవీ చదవండి..

7.5శాతం ఫిట్‌మెంట్‌ సమ్మతం కాదు: పీఆర్టీయూ

‘‘శివుడు వస్తున్నాడు’’.. పని పూర్తయింది..Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని