గోల్డెన్‌ ఐడియా: బంగారు రేజర్‌తో షేవింగ్‌..!
close

తాజా వార్తలు

Updated : 05/03/2021 04:50 IST

గోల్డెన్‌ ఐడియా: బంగారు రేజర్‌తో షేవింగ్‌..!

పుణె: కరోనా.. లాక్‌డౌన్‌ తర్వాత అన్ని వ్యాపారాలు నెమ్మదిగానే సాగుతున్నాయి. దీంతో కస్టమర్లను ఆకట్టుకోవడం వ్యాపారస్తులు.. దుకాణాల యజమానులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ సెలూన్‌ యజమాని కస్టమర్లను ఆకర్షించేందుకు బంగారు రేజర్‌తో షేవింగ్‌ చేస్తున్నాడు. కరోనాకు ముందు పుణెకు చెందిన అవినాష్‌ బొరుండియా సెలూన్‌ షాపు కస్టమర్లతో చాలా బిజీగా ఉండేది. కానీ, కరోనా సంక్షోభంలో మూతపడింది. కొన్నాళ్ల కిందటే మళ్లీ సెలూన్‌ తెరిచినా.. కస్టమర్లు లేక వెలవెలబోయింది. దీంతో ఉపాయం ఆలోచించిన అవినాష్‌ 80 గ్రాముల బంగారంతో ఒక రేజర్‌ చేయించాడు. ఇందుకోసం రూ.4లక్షలు ఖర్చయిందట. బంగారు రేజర్‌తో షేవింగ్‌ చేయించుకోవడం అంటే.. అందరికంటే కాస్త భిన్నంగా.. గొప్పగానే ఉంటుంది కదా! ప్రజలు ఆ విధంగా ఆలోచించి అయినా తన సెలూన్‌కు వస్తారని భావించాడు. ఈ మేరకు తన సెలూన్‌లో కొన్ని మార్పులు చేసి, స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా బంగారు రేజర్‌తో షేవింగ్‌ సేవలను ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ప్రస్తుతం అతడి సెలూన్‌ ముందు క్యూ కడుతున్నారు. బంగారు రేజర్‌తో షేవింగ్‌ చేసినందుకు అవినాష్‌ రూ.100 వసూలు చేస్తున్నాడు. అంత ఇవ్వలేకపోయినా కస్టమర్‌ ఆనందం కోసం తక్కువ మొత్తానికి కూడా షేవింగ్‌ చేస్తున్నాడట. భలే ఆలోచన కదా..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని