ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించాలని..

తాజా వార్తలు

Updated : 22/06/2021 16:27 IST

ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించాలని..

క్యాన్సర్‌ ఆస్పత్రి 21వ వార్షికోత్సవంలో బాలకృష్ణ

హైదరాబాద్‌ : బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి 21వ వార్షికోత్సవంలో ఆస్పత్రి ఛైర్మన్‌ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఆస్పత్రి 21 ఏళ్లు పూర్తి చేసుకుని 22వ వసంతంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

‘‘అనేక కారణాలతో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ ఒకరకమైన మానసిక క్షోభ కలిగిస్తుంది. అత్యంత ఖరీదైన వైద్యాన్ని పేదలకు చేరువ చేయాలన్న మహోన్నత లక్ష్యంతో ఈ అస్పత్రిని ఏర్పాటు చేశాం. 100 పడకలతో మొదలైన ఆస్పత్రిలో ఈ రోజు 500లకి పైగా పడకలు ఉన్నాయి. దాతలు ముందుకొచ్చి ఆస్పత్రికి సహాయం చేశారు. అత్యాధునిక పరికరాలను వినియోగించి రోగులకు చికిత్స అందిస్తున్నాం. నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. కొవిడ్ కారణంగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా వేడుకలు జరుపుకొంటున్నాం. ఆస్పత్రిలో ఆరుగురు బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స అందించి డిశ్ఛార్జ్‌ చేశాం. ఆస్పత్రికి పలు అవార్డులు వచ్చాయి’’ అని బాలకృష్ణ తెలిపారు. కరోనా సమయంలో అందరూ ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని