close
Array ( ) 1

తాజా వార్తలు

4 దేశాల సిరీస్‌ కోసం వేచి చూడాల్సిందే..!

ముంబయి: మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక కొత్త ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నవంబర్‌లో బంగ్లాదేశ్‌ను ఒప్పించి టీమ్‌ ఇండియాతో తొలి డే/నైట్‌ టెస్టు నిర్వహించాడు. తర్వాత నాలుగు దేశాల సూపర్‌ సిరీస్‌ నిర్వహించాలని వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాతో పాటు మరో టాప్‌ జట్టుతో ఏటా ఓ సూపర్‌ సిరీస్‌ నిర్వహించాలని భావించాడు. ఈ క్రమంలోనే డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డుతో సంప్రదించాడు. అలాగే జనవరిలో క్రికెట్‌ ఆస్ట్రేలియాతో మాట్లాడాడు. అయితే, ఈ రెండు బోర్డులు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తెలియజేయనప్పటికీ బీసీసీఐ ఆశావాహ దృక్పథంతో ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా ఈ సిరీస్‌ నిర్వహణపై బీసీసీఐ తాజాగా ఓ స్పష్టతనిచ్చింది.

వచ్చే ఏడాది నుంచి నిర్వహించాలని తలపెట్టిన సూపర్‌ సిరీస్‌ నిర్వహణపై ఆసీస్‌, ఇంగ్లాండ్‌ బోర్డులు ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. ‘2021 నుంచి నాలుగు దేశాల సూపర్‌ సిరీస్‌ నిర్వహించాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఈ విషయంపై ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా బోర్డులతో చర్చించాం. అయితే, ఈ సిరీస్‌ నిర్వహించడానికి ముందు కొన్ని సమస్యలు, అడ్డంకులు ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సి ఉంది. ఆ తర్వాతే సూపర్‌ సిరీస్‌కు సంబంధించిన తర్వాతి కార్యాచరణను ప్రారంభించాల్సి ఉంది. అందుకోసం ఇంకాస్త సమయం వేచి చూడాలి’ అని ఆయన వివరించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.