పంచాయతీ ఎన్నికల బరిలో ‘అందాల రాణి’
close

తాజా వార్తలు

Updated : 03/04/2021 12:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంచాయతీ ఎన్నికల బరిలో ‘అందాల రాణి’

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో జాన్‌పూర్ జిల్లా బక్షా డెవపల్‌పెంట్‌ బ్లాక్ పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడి 26వ వార్డు నుంచి మోడల్‌, అందాల రాణి దీక్షా సింగ్‌ బరిలోకి దిగుతున్నారు. 

 2015లో జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచిన దీక్షా సింగ్‌.. ప్రైవేటు ఆల్బమ్స్‌తో పాటు పలు ప్రకటనల్లో నటించారు. ఇప్పుడు తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దీక్ష తండ్రి జితేంద్ర సింగ్‌.. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బక్షా డెవలప్‌మెంట్‌ బ్లాక్‌లోని 26వ వార్డు నుంచి పోటీ చేసేందుకు చాలా రోజుల నుంచి సిద్ధమయ్యారు. అయితే ఈ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో దీక్షను బరిలోకి దించుతున్నారు. ఎన్నికల్లో ఆమె భాజపా అభ్యర్థి షాలినీ సింగ్‌తో తలపడనున్నారు. దీక్ష స్వస్థలం బక్ష ప్రాంతంలోని చిట్టోరి గ్రామం. అయితే వ్యాపార రీత్యా గోవాలో స్థిరపడింది. ఆమె తండ్రి జితేంద్ర గోవా, రాజస్థాన్‌లో ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌ నిర్వహిస్తున్నారు.

యూపీలో ఏప్రిల్‌ 15 నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జాన్‌పూర్‌ జిల్లాలో తొలి విడతలో భాగంగా ఏప్రిల్‌ 15న పోలింగ్‌ నిర్వహించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని