Bengal:లోకల్‌ రైళ్లు రద్దు..కర్ఫ్యూ తరహా ఆంక్షలు
close

తాజా వార్తలు

Updated : 05/05/2021 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bengal:లోకల్‌ రైళ్లు రద్దు..కర్ఫ్యూ తరహా ఆంక్షలు

కోల్‌కతా: కరోనా కట్టడికి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్యలు మొదలు పెట్టారు. ఇటీవల రాష్ట్రంలో రెండోసారి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గెలుపు సంబరాలను పక్కనపెట్టి కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం నుంచి లోకల్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు మమత ప్రకటించారు. అదేవిధంగా మెట్రో, బస్సులు 50శాతం ఆక్సెపెన్సీతో నడపాలని నిర్ణయించారు.

‘మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను 50శాతం హాజరుతో నడపాలి. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, జిమ్‌లు, సినిమాహాళ్లు, బ్యూటీ పార్లర్‌లు సహా జన సమూహాలు ఉండే అన్నింటినీ మూసేయాలి. ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ మాత్రమే మార్కెట్లు, దుకాణాలు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలి’అని మమత అధికారులను ఆదేశించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ చూపించాలి. అది కూడా 72గంటలు దాటి ఉండకూడదు. రైలు ప్రయాణికులతో పాటు, అందరికీ ఇది వర్తిస్తుంది. మార్కెట్లు, దుకాణాల్లో రద్దీని తగ్గించేందుకు ఎక్కువమంది ప్రజలు ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, హోం డెలివరీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రైవేటు కార్యాలయాలు కూడా 50శాతం ఉద్యోగులతోనే నడపాలి. జ్యువెలరీ షాపులు మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ తెరిచి ఉంచవచ్చు. బ్యాంకులు ఉదయం 10గంటల నుంచి 2 వరకూ మాత్రమే పనిచేసేలా చూడాలని మమత అధికారులకు సూచించారు.

బిహార్‌ 11 రోజుల పాటు లాక్‌డౌన్‌

నానాటికీ పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని బిహార్‌ ప్రభుత్వం 11 రోజుల పాటు పూర్తి లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ మాత్రమే నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత దుకాణదారులు తెరిచి ఉంచితే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మరోవైపు ఉదయం నుంచే పోలీసులు వీధుల్లో పెట్రోలింగ్‌ చేస్తూ, ప్రజలను హెచ్చరిస్తున్నారు. నిర్దేశించిన వేళల్లో తప్పితే ఎవరైనా బయట కనపడితే చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఖాళీ రోడ్లపై ద్విచక్రవాహనాలతో తిరుగుతున్న పలువురు యువతను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి వదిలేశారు. మే 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని