close

తాజా వార్తలు

Published : 04/03/2021 10:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆన్‌లైన్‌లో భద్రాద్రి శ్రీరామనవమి టికెట్లు

భద్రాద్రి: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాద్రిలో నిర్వహించే సీతారాముల కల్యాణం, పట్టాభిషేకానికి సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో రేపటి నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు ఆలయ ఈవో శివాజీ గురువారం తెలిపారు. ఏప్రిల్‌ 13 నుంచి 27 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 21న సీతారాముల కల్యాణం, 22న పట్టాభిషేకం కార్యక్రమాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన 20 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. రూ.5 వేలు, రూ. 2వేలు, రూ.1,116, రూ.500, రూ.200, రూ.100 టికెట్లను విక్రయించనున్నారు. రూ.5 వేల టికెట్‌పై ఇద్దరికి ప్రవేశం కల్పించనున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు. కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 15 వేల మందికి ఉచిత ప్రవేశం కల్పిస్తామని వివరించారు.  


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని