తమిళ నటుడు భాగ్యరాజ్‌ దంపతులకు కరోనా
close

తాజా వార్తలు

Published : 07/05/2021 18:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళ నటుడు భాగ్యరాజ్‌ దంపతులకు కరోనా

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత-దర్శకుడు కె.భాగ్యరాజ్‌ కరోనా బారినపడ్డారు. ఆయన సతీమణి పూర్ణిమ భాగ్యరాజ్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని వారి కుమారుడు శంతన్‌ భాగ్యరాజ్‌ ట్వీటర్‌లో  వెల్లడించారు. ‘‘నా తల్లితండ్రులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సూచన మేరకు సిబ్బంది సహా మేమందరం ఇంట్లోనే స్వీయనిర్బంధంలోకి వెళ్లాం. ఇటీవల మమ్మల్ని సంప్రదించిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాం. దయచేసి వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’’ అని పేర్కొన్నారు.

భాగ్యరాజ్‌ తెలుగులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సీత’ చిత్రంలో కాజల్‌ తండ్రిగా నటించారు. ఆయన  తెలుగులో ‘మాయదారి మొగుడు’చిత్రానికి దర్శకత్వం వహించారు. బాపు తీసిన ‘రాధా గోపాళం’లో లాయర్‌గా అతిథి పాత్రలో నటించారు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన చాలా సినిమాలు తెలుగులో డబ్బింగ్‌ అయ్యాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని