CJI: జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన ప్రముఖులు

తాజా వార్తలు

Published : 15/06/2021 20:18 IST

CJI: జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసిన ప్రముఖులు

హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను పలువురు ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా జస్టిస్‌ ఎన్వీ రమణ రాజ్‌భవన్‌లో మొక్కను నాటారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ వృక్షవేదం పుస్తకాన్ని సీజేఐకి బహూకరించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు జస్టిస్‌ ఎన్వీ రమణను కలిసి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసుల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి, విప్‌ భానుప్రసాదరావు మర్యదాపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు సమాఖ్య నేతలు సీజేఐను కలిసి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వివాదానికి పరిష్కారం చూపాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని