close

తాజా వార్తలు

Updated : 17/02/2021 02:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భీమవరంలో కిడ్నాప్‌..అచ్యుతాపురంలో హత్య

అశ్వారావుపేట గ్రామీణం: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భీమవరం వాసి హత్యకు గురయ్యాడు. దమ్మపేట మండలం అచ్యుతాపురం సమీపంలోని జీడి మామిడి తోటలో మంగళవారం ఉదయం మృతదేహాన్ని గర్తించారు. పోలీసుల కథనం ప్రకారం...పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రొయ్యల వ్యాపారి రెడ్డి కోదండరామారావు(39) ఈనెల 11వ తేదీ నుంచి కనిపించటం లేదని అతని భార్య కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన భీమవరం టూ టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం తెలంగాణలోని కొత్తగూడెం జిల్లా దమ్మపేట సమీపంలోని జీడిమామిడ తోటలో గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది.  అప్పటికే భీమవరం పోలీసులు సర్కిల్‌ పరిధిలోని పోలీసులకు వ్యాపారి అదృశ్యంపై సమాచారం ఇచ్చారు. దమ్మపేట శివారులో గుర్తుతెలియని మృతదేహం ఉన్నట్టు స్థానిక పోలీసులు భీమవరం పోలీసులకు తెలిపారు. దీంతో  అక్కడి చేరుకున్న పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు మృతదేహం కోదండరామారావుదే అని గుర్తించారు. రామారావుని వ్యాపార భాగస్వాములే హత్య చేసి ఉంటారని ఆయన భార్య కల్యాణి ఆరోపించారు. కల్యాణి ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు భీమవరం టౌటౌన్‌ ఎస్‌ఐ విజయ్‌ కుమార్‌ తెలిపారు. హత్యకు వ్యాపార లావాదేవీలే కారణమని భావిస్తున్నారు. భీమవరంలో నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని