
తాజా వార్తలు
భోగిపళ్లు కావాలా.. అక్కడికెళ్లాల్సిందే మరి!
ఇంటర్నెట్‌డెస్క్: మడత కాజాలకు కాకినాడ ఫేమస్.. పూతరేకులకు ఆత్రేయపురం ప్రసిద్ధి. సంక్రాంతి సంబురాలు, కోడి పందేళ్లకు గోదావరి జిల్లాలు సుప్రసిద్ధి. మరి భోగిరోజు ఉపయోగించే భోగిపళ్ల సంగతేంటి? గుంటూరు జిల్లాలో భోగిపళ్లకు అవసరమైన రేగి తోటలు చాలా ఉన్నాయి. ఇంతకీ ఆ తోటల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
భోగి రోజున చిన్న పిల్లలకు భోగిపళ్లు పోయడం ఆనవాయితీ. బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు, అక్షింతలు కలిపి పిల్లల తలపై పోసి ఆశీర్వదిస్తారు. అయితే, భోగి సందర్భంగా వాడే భోగిపండ్లను గుంటూరు జిల్లాలోని చినకోండ్రుపాడు ప్రతీతి. ఇక్కడ 50 ఎకరాలకు పైగా నాటు రేగి తోటలు ఉన్నాయి. ఎర్రరేగడి నేలలు, కొండలతో కూడిన అటవీ ప్రాంతం వంటి అనుకూలతలతో గత నాలుగు దశాబ్దాలకుపైగా ఇక్కడ రేగి సాగవుతోంది. అయితే, సాధారణ రోజుల్లో వ్యాపారులు ఈ తోటల్లో కనిపిస్తే భోగి రోజు మాత్రం సామాన్యులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. భోగి కోసం స్వయంగా తోట వద్దే రేగిపళ్లను కొనుగోలు చేసి వాటితో భోగిపళ్లు పోయడం అలవాటని కొనుగోలుదారులు చెబుతున్నారు.
‘‘కోండ్రుపాడులో రేగిపళ్లు బాగుంటాయి. ఏటా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తుంటాం. తోటకు వస్తే తాజా పండ్లు దొరుకుతాయి. నచ్చినవి తీసుకోవచ్చు. ఇళ్ల దగ్గరకు కూడా రేగిపళ్లు వస్తాయి. కానీ అవి అంత బాగుండవు. వాటికంటే ఇవి చాలా బాగుంటాయి’’ అని కొనుగోలు దారులు తెలిపారు.
‘‘వ్యాపారులకైతే మానుకు రూ.50.. తినేవాళ్లు, సామాన్య ప్రజలకు మాత్రం రూ.120కి విక్రయిస్తున్నాం. అయితే ఏటా జనం జాతరకు వచ్చినట్లు వచ్చేవారు. ఈ ఏడు కొనుగోలుదారులు పెద్దగా లేరు’’ అని సాగుదారులు చెబుతున్నారు. పూర్తి సమాచారం ఈ కింద వీడియోలో..
ఇదీ చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ‘భోగి’ సందడి
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భారత్ చిరస్మరణీయ విజయం..
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- కొత్త అధ్యక్షుడి తీరని కోరిక!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
