Russell:బయోబబుల్‌ నరకంలా ఉంటుంది:రసెల్‌ 
close

తాజా వార్తలు

Published : 04/06/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Russell:బయోబబుల్‌ నరకంలా ఉంటుంది:రసెల్‌ 

(photo:Andre Russell Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా మహమ్మారి వల్ల ప్రస్తుతం ఏ క్రీడలు నిర్వహించాలన్నా బయోబబుల్ విధానాన్నే అనుసరిస్తున్నారు. ఒక్కసారి బయోబబుల్‌లోకి వెళ్లిన ఆటగాళ్లు, శిక్షణ, సహాయక సిబ్బంది ఆ టోర్నీలు ముగిసేవరకు అందులోనే ఉండాల్సి ఉంటుంది. ఈ క్రమంలో  బయోబబుల్‌లో ఉన్న సమయంలో తనకు ఎదురైన అనుభవాలను వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ బయటపెట్టాడు.

‘నేను ఏ ఇతర ఆటగాళ్ల గురించిగానీ, కోచ్‌ల గురించిగానీ మాట్లాడటం లేదు. నా వ్యాఖ్యలు నాకు మాత్రమే పరిమితం. బయోబబుల్‌లో నరకంలా అనిపిస్తుంది. అది నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మొన్నటి వరకు ఐపీఎల్‌ 14 సీజన్‌ కోసం బయోబబుల్‌లో ఉన్నా. అక్కడ నుంచి తాజాగా పీఎస్‌ఎల్‌ ఆడేందుకు దుబాయ్‌లోని బయోబబుల్‌కి చేరుకున్నా. అలా ఒక బబుల్ నుంచి మరో బబుల్‌కి వచ్చిన నాకు బయటకు వెళ్లే అవకాశం లేదు.  నచ్చిన ప్రదేశానికి, కనీసం నడవడానికి కూడా వెళ్లడానికి లేదు. ఇది నాకు ఎదురైన వింత అనుభవం. అయినా ఇవన్నీ తట్టుకోవడానికి ఒకటే కారణం. బయోబబుల్‌లో ఉంటున్నా నాకిష్టమైన క్రికెట్‌ ఆడుతున్నా. దీనిని గొప్ప విషయంగా భావిస్తున్నా. నా విధిని నేను నిర్వర్తిస్తున్నా’ అని రసెల్ పేర్కొన్నాడు.

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని