
తాజా వార్తలు
దిల్లీలో 100 కాకులు మృతి
పరీక్షలకు పంపిన వైద్యులు
దిల్లీ: దేశ వ్యాప్తంగా బర్డ్‌ఫ్లూపై కేంద్రం అలర్ట్ విధించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో 100కు పైగా కాకులు మరణించడంతో ఆందోళన నెలకొంది. దిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 3లో 100కు పైగా కాకులు మరణించడంతో వైద్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే దేశంలోని ఐదు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూను గుర్తించడంతో మరణించిన కాకులను పరీక్షలకు పంపారు. ఇప్పటికే కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో బర్డ్‌ఫ్లూ వ్యాపించడంతో కేంద్రం అప్రమత్తమైంది. దీనిపై ప్రత్యేక కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది. దిల్లీలో కాకులు మరణించడంతో డాక్టర్ల బృందం అక్కడకు చేరుకొని నమూనాలను పరీక్షలకు పంపారు. ఫలితాలు వచ్చిన తర్వాత కాకుల మరణాలకు కారణం తెలుస్తుందని వారు తెలిపారు. గత మూడు రోజులుగా ఆ ప్రాంతంలో కాకులు మరణిస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి..
భారత్ బయోటెక్ నుంచి మరో టీకా