న్యాయవాదుల హత్య: కస్టడీకి బిట్టు శ్రీను
close

తాజా వార్తలు

Updated : 28/02/2021 11:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

న్యాయవాదుల హత్య: కస్టడీకి బిట్టు శ్రీను

మంథని: పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) హత్యకేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నాలుగో నిందితుడి(ఏ4)గా ఉన్న బిట్టు శ్రీనును కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన మంథని న్యాయస్థానం బిట్టు శ్రీనును వారం రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీనుతో పాటు మరో ఇద్దరు నిందితులు ఇప్పటికే పోలీసు కస్టడీలో ఉన్నారు. తాజాగా బిట్టు శ్రీనును కస్టడీకి ఇవ్వడంతో నలుగురు నిందితులను కలిపి పోలీసులు విచారించనున్నారు. కోర్టు అనుమతి మేరకు నిందితులను లోతుగా విచారిస్తే కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని