తిరుపతి భాజపా అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌
close

తాజా వార్తలు

Updated : 26/03/2021 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతి భాజపా అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌

దిల్లీ: చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు భాజపా-జనసేన ఉమ్మడి అభ్యర్థిని కమల దళం ఖరారు చేసింది. అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ అధికారిణి రత్నప్రభ పేరును ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ప్రకటించారు. తమ పార్టీ ఎంపీ అభ్యర్థి  రత్నప్రభకు ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వ సీఎస్‌గా పని చేసిన రత్నప్రభ ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఆమె అపార అనుభవం తిరుపతి అభివృద్ధికి ఎంతో ఉపయుక్తం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ సహకారంతో తిరుపతిని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు తమ అభ్యర్థికే పట్టం కట్టాలని కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని