
తాజా వార్తలు
మెట్పల్లిలో తెరాస, భాజపా శ్రేణుల తోపులాట
మెట్పల్లి: అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వొద్దంటూ కోరుట్ల ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు చేసిన వ్యాఖ్యలపై జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక శాస్త్రి చౌరస్తాలో భాజపా శ్రేణులు నిరసనకు దిగాయి. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న తెరాస శ్రేణులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో స్థానికంగా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న జగిత్యాల ఎస్పీ సునీల్ శర్మ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించేలా చర్యలు చేపట్టారు. మరోవైపు మెట్‌పల్లిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి..
‘అయోధ్య రామమందిరానికి విరాళాలు ఇవ్వొద్దు’
TS: ఈడబ్ల్యూఎస్ కోటాపై కీలక నిర్ణయం
Tags :