తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌ రద్దు చేయాలి: సోము
close

తాజా వార్తలు

Published : 18/04/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌ రద్దు చేయాలి: సోము

తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ రద్దు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. మంత్రులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. ఉప ఎన్ని్కలో దొంగ ఓట్ల బాగోతం విచ్చలవిడిగా సాగిందని.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆక్షేపించారు. వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం తగ్గిందని సోము వీర్రాజు అన్నారు. నిన్న జరిగిన దొంగ ఓట్ల ఘటనపై సీఎం జగన్ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొంగ ఓట్ల విషయంలో ప్రజలకు అబద్ధాలు చెప్పారని సోము ఆగ్రహం వ్యక్తం చేశారు.   


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని