close

తాజా వార్తలు

Published : 05/04/2021 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బెంగాల్‌: భాజపా మహిళా అభ్యర్థిపై దాడి

కోల్‌కతా: బెంగాల్‌ రాజకీయాలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారాయి. గతంలో ప్రచారానికి వెళుతుండగా భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వాహనంపై రాళ్ల దాడి జరిగింది. బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు భాజపా ఆరోపించింది. కొద్ది రోజుల క్రితం నందిగ్రామ్‌లో ప్రచారం నిర్వహిస్తున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రమాదానికి గురయ్యారు. కొందరు తనపై దాడికి పాల్పడినట్లు దీదీ ఆరోపించారు.

తాజాగా భాజపా మహిళా అభ్యర్థినిపై దాడి జరిగింది. బేహలా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నటి పాయల్‌ సర్కార్‌ వాహన శ్రేణిపై కొందరు రాళ్ల దాడి చేశారు. ఠాకూర్‌పుర్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. దీంతో ఠాకూర్‌పుర్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది. అధికార టీఎంసీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు భాజపా నేతలు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని