close

తాజా వార్తలు

Published : 05/03/2021 22:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అసోం పోల్స్: 70 మందితో భాజపా జాబితా

గువాహటి: అసోం అసెంబ్లీ ఎన్నికలకు అధికార భాజపా అభ్యర్థులను ప్రకటించింది. 70 మందితో రూపొందించిన తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. అసోంలో మొత్తం 126 స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. ఈ రోజు 70మందితో జాబితాను విడుదల చేసినట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ వెల్లడించారు. అలాగే, తమ మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్‌ (ఏజీపీ)కి 26 సీట్లు, యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ (లిబరల్‌)కు 8 సీట్లు కేటాయించినట్టు తెలిపారు. అసోం ముఖ్యమంత్రి శర్వానంద్‌ సోనోవాల్‌ మజూలీ నియోజవకర్గం నుంచి, మంత్రి హిమంతబిశ్వ శర్మ జలుక్‌బరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఈ స్థానాల నుంచే వారిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అసోంలో మొత్తం 126 అసెంబ్లీ నియోజకవర్గాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో తొలి విడతలో 47 స్థానాలకు ఎన్నికలు మార్చి 27న జరగనుండగా.. 39 స్థానాలకు రెండో విడత పోలింగ్‌ ఏప్రిల్‌ 1న జరగనుంది. ఏప్రిల్‌ 6న మూడో దశ పోలింగ్‌ 40 స్థానాలకు జరగనుంది. ప్రస్తుతం ఒకటి, రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్న స్థానాలకు భాజపా నుంచి 70 మంది అభ్యర్థులతో కమలనాథులు జాబితాను విడుదల చేశారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని