close

తాజా వార్తలు

Updated : 25/11/2020 12:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాజపా అగ్రనేతలు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికలను భారతీయ జనతాపార్టీ  మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రేపు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడంతో పాటు, జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగుతున్నారు. మేనిఫెస్టోను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విడుదల చేయనుండగా.. ప్రచారాన్ని మరింత వేడెక్కించేందుకు కమలనాథులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలు గ్రేటర్‌ ప్రచారంలో పాల్గొంటుండగా... భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రచార క్షేత్రంలో దిగనున్నారు.

ఈ నెల 27న ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రానున్నారు. పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈనెల 28న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్‌ షోలో పాల్గొనడంతో పాటు మేధావుల సమావేశాల్లో పాల్గొంటారు. ఈనెల 29న హైదరాబాద్‌ రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షోలో పాల్గొంటారు.Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన