close

తాజా వార్తలు

Published : 10/01/2021 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు :బండి సంజయ్‌

 

హైదరాబాద్‌: కేంద్రం నిధులు పక్కదారి పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. జిల్లాల్లో ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు తెరాస, కాంగ్రెస్‌ నాయకులు బండి సంజయ్‌ సమక్షంలో భాజపాలో చేరారు. 

మంత్రి పదవులు రాకపోతే తెరాస ఎమ్మెల్యేలు సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని ఈ సందర్భంగా బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. ‘కరీంనగర్- వరంగల్‌ రహదారికి కేంద్రం నిధులు ఇచ్చింది. టెండర్లు పిలవకుండానే పనులు ప్రారంభించారు. తెరాస నేతలకు కాంట్రాక్టులు ఇస్తున్నారు. సీఎం పేరు చెప్పి కాంట్రాక్టర్లు, అధికారులు దోచుకుంటున్నారు. సీఎంఓ ప్రజల కోసం పనిచేస్తో్ందా.. కమీషన్ల కోసం పనిచేస్తోందా?’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక, కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొన్నటి ఫలితాలే పునరావృతం కాబోతున్నాయని పేర్కొన్నారు. 
 

ఇవీ చదవండి..
వైభవంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణోత్సవం

కొనుగోలు కేంద్రాల రద్దు సరైనది కాదు: భట్టి



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని