close

తాజా వార్తలు

Updated : 21/01/2021 15:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వ అండతోనే విగ్రహాల ధ్వంసం: కన్నా

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వ అండదండలతోనే విగ్రహాల ధ్వంసం జరుగుతోందని భాజపా సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఆలయాలపై దాడుల విషయంలో డీజీపీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ చేపట్టిన ఆందోళనకు వెళ్లకుండా పోలీసులు కన్నాను గృహ నిర్బంధం చేశారు. ఇంటి నుంచి బయటకు రావొద్దని నోటీసులు ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

‘‘రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యం లేదు. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. కారణం చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదు. ఎంతో ఆదర్శనీయంగా ఉండే పోలీసు వ్యవస్థ అధికార పార్టీ చెప్పినట్లు నడుచుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాలు, డబ్బులు పంచి మళ్లీ ఎన్నికల్లో గెలవొచ్చని భావిస్తున్నారు. ఇవేవీ వారి సొంత డబ్బులు కాదు. విగ్రహాల ధ్వంసానికి కారకులు ఎవరో ప్రభుత్వం వారంలోగా చెప్పాలి’’ అని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు.

ఇవీ చదవండి..
ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు

కళా వెంకట్రావు చేసిన తప్పేంటి?:చంద్రబాబు



Tags :

రాజకీయం

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని