
తాజా వార్తలు
తెరాస అక్రమాలపై విచారణ జరపాలి: ప్రభాకర్
హైదరాబాద్: పాత విధానంలోనే సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై భాజపా సీనియర్ నేత ప్రభాకర్ మండిపడ్డారు. బినామీ వ్యవహారాలను చట్టబద్ధం చేసుకునేందుకు దీనిని తీసుకువచ్చారని ఆరోపించారు. హఫీజ్‌పేట భూ వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని దుయ్యబట్టారు. సీఎం బంధువులు దేవాలయ, వక్ఫ్‌భూములపై కన్నేశారని, రియల్టర్ల కోసమే ప్రభుత్వం లింక్ రోడ్డులు ఏర్పాటు చేసిందని ప్రభాకర్ అన్నారు. సీఎంవోలోనే వందల ఎకరాల భూముల ఒప్పందాలు జరిగాయన్నారు. సీఎం బంధువులు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఖాళీ, వివాదాస్పద భూములను మజ్లిస్, తెరాస స్వాహా చేస్తున్నాయన్నారు. మేయర్ ఎన్నికలోపే అక్రమ నిర్మాణాలు చేపట్టాలని తెరాస యత్నిస్తోందని ఆరోపించారు.తెరాస అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెరాస అక్రమాలపై పేర్లతో సహా పండగ తర్వాత బయటపెడతామన్నారు. సాదా బైనామాలు.. తెరాస నేతల బినామీ వ్యవహారంగా మారిందని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి
వారంతా సంఘ విద్రోహ శక్తులే: ఉండవల్లి
జనగామలో భాజపా నేతలపై లాఠీఛార్జి