దేశం కోసమే ప్రైవేటీకరణ: భాజపా
close

తాజా వార్తలు

Updated : 13/03/2021 13:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేశం కోసమే ప్రైవేటీకరణ: భాజపా

విజయవాడ: దేశవ్యాప్త విధానంలో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తున్నామని భాజపా నేత సునీల్‌ దేవ్‌ధర్‌ అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల బాధ్యత కేంద్రానిదే అని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ విజయవాడలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిణామాలు, తిరుపతి ఉపఎన్నికపై సమావేశంలో చర్చించారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి అంశంలో నేతలు అభిప్రాయాలు సేకరించారు. విశ్రాంత కేంద్ర సర్వీసు అధికారిని పోటీలో నిలిపే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సునీల్‌ దేవ్‌ధర్ మాట్లాడుతూ ‘‘దేశ వ్యాప్తంగా నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఓ నిర్ణయం తీసుకుంది. ఇది విశాఖపట్నం ఉక్కు పరిశ్రమకు ప్రత్యేకంగా కాదు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా ఉంది. రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం విశాఖ ఉక్కు అంశాన్ని ముందు ఉంచి తెర వెనుక నిశ్శబ్దంగా  మతమార్పిడులు చేస్తోంది. ఇక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు కుల రాజకీయాలు చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో అక్రమంగా పెద్ద శిలువ ఏర్పాటు చేస్తే అధికారులు తగిన రీతిలో స్పందించలేదు. మా పార్టీ రాజకీయాలు ఒక్కటే చేయదు.. 80 శాతం ప్రజలకు సేవచేయడమే కర్తవ్యం. అర్హులైన అందరికీ కరోనా టీకా అందించేందుకు మండల స్థాయి నుంచి విస్తృత ప్రచారం చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించారు. త్వరలో ఈకార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతాం’’ అని సునీల్‌ దేవ్‌ధర్ వివరించారు.  

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో అందరి అభిప్రాయాలను సేకరిస్తామని ఎమ్మెల్సీ మాధవ్‌ తెలిపారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అవసరమైనప్పుడల్లా రాష్ట్ర నాయకులు కేంద్రం వద్దకు వెళ్లి వివరిస్తారని తెలిపారు. విశాఖ ఉక్కుపై కొన్ని పార్టీలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని మాధవ్‌ ఆరోపించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని