ఏపీలో హెల్త్‌ ఎమర్జెన్సీ పెట్టాలి: భాజపా
close

తాజా వార్తలు

Published : 28/04/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో హెల్త్‌ ఎమర్జెన్సీ పెట్టాలి: భాజపా

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లో హెల్త్‌ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణకుమార్‌రాజు అభిప్రాయపడ్డారు. విశాఖ భాజపా కార్యాలయంలో మీడియాతో మంగళవారం ఆయన మాట్లాడారు. ఏపీలో రాత్రి కర్ఫ్యూ ఓ తుగ్లక్‌ చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టి మందుల కొరత లేకుండా చూడాలన్నారు. ఔషధాలపై 3 నెలలు జీఎస్టీ లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీలో భవనాలు కూల్చివేత, చిన్న చిన్న షాపుల తొలగింపుపై అధికార యంత్రాంగానికి ఉన్న శ్రద్ధ.. కరోనా వ్యాప్తి నియంత్రణపై లేదని విమర్శించారు. కొవిడ్‌ సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు సమంజసం? అని ఆయన ప్రశ్నించారు. ఇంకా మూడేళ్లపాటు జగన్‌ సీఎంగా ఉంటారని తాను అనుకోవడం లేదని విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని