
తాజా వార్తలు
వరద బాధితులను కేసీఆర్ పరామర్శించారా?: బండి
హైదరాబాద్: గ్రేటర్లో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కవాడిగూడ డివిజన్లో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ... కవాడిగూడలో అందరూ ఓటు బ్యాంకుగా మారి తెరాసకు బుద్ది చెప్పాలని కోరారు. తెరాస నాయకులు ఎన్నికలు వస్తేనే కనిపిస్తారని విమర్శించారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వమే సహాయం చేసిందని, సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ దాటి బయటకు రాలేదన్నారు. వరదల సమయంలో మోదీ ఎందుకు రాలేదని కేటీఆర్ అడుగుతున్నారు...కానీ, కేసీఆర్ హైదరాబాద్‌లో ఉండి కూడా వరద బాధితులను పరామర్శించడానికి రాలేదన్నారు. కవాడిగూడ డివిజన్లో భాజపాను గెలిపిస్తే డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తాం, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తన సంతకం ఫోర్జరీ చేసి, నకిలీ లెటర్ సృష్టించి వరద బాధితులకు రూ.10వేల సాయం అందకుండా చేశారని ఆరోపించారు. భాజపా జీహెచ్ఎంసీలో గెలిచిన తర్వాత వరద బాధితులకు రూ.25వేల సాయం అందిస్తామని ప్రకటించారు. తెరాస నేతలు డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ, భాజపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. లక్ష్మణ్ మాట్లాడుతూ..కేంద్రం నుంచి నిధులు తెచ్చి కవాడిగూడను అభివృద్ధి చేస్తామన్నారు.