close

తాజా వార్తలు

Published : 28/02/2021 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుటుంబ పార్టీలు న్యాయం చేయలేవు: జావడేకర్‌

హైదరాబాద్‌: భాజపా అభ్యర్థి రాంచంద్రరావు ఎమ్మెల్సీగా మళ్లీ గెలిస్తే శాసనమండలిలో సమస్యగా మారుతుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో పట్టభద్రుల పాత్ర’ అనే అంశంపై సికింద్రాబాద్ మ్యారియట్ హోటల్‌లో భాజపా నిర్వహించిన సదస్సుకు జావడేకర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రాంచంద్రరావు కౌన్సిల్ ప్రసంగాల పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు. కుటుంబ పార్టీలు తెలంగాణకు న్యాయం చేయలేవని, దేశాన్ని మరో మెట్టు ఎక్కించిన భాజపాకు ఓటు వేయాలన్నారు.  దేశం మొత్తం భాజపాను ఇష్టపడుతున్నారని, ఇందుకు ఇటీవల జరిగిన గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. రాజీవ్ గాంధీ కాలంలో పేదల కోసం రూ.100 కేటాయిస్తే అందులో కేవలం రూ.15 మాత్రమే వారికి చేరేదన్నారు. ఇప్పుడు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నూటికి నూరు శాతం పేదలకు చేరుతున్నాయన్నారు. పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం ఖాయమని జావడేకర్‌ దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో మనదేశం చాలా ప్రాంతాలను కోల్పోయిందని.. ఇప్పుడు మొదటి సారిగా ప్రత్యర్థులు వెనక్కి వెళ్తున్నారని వెల్లడించారు.

భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీ అబద్దపు ప్రచారాలకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో ఇప్పుడు కూడా అంతే మంది ఉన్నారని విమర్శించారు. మంత్రి కేటీఆర్ విడుదల చేసిన ఉద్యోగాల సంఖ్యలో క్రమబద్ధీకరించినవారి వివరాలు కూడా ఉన్నాయని చెప్పారు. రామచంద్రరావు మండలిలో ఏమీ మాట్లాడలేదని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారని.. అందుకే పుస్తకం విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశాలకు వంద శాతం హాజరైన ఒకే ఒక్క ఎమ్మెల్సీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ నిమిషాలు మాట్లాడిన వ్యక్తిని కూడా తనేనన్నారు. న్యాయవాదులకు నిధుల విడుదలలో కీలకపాత్ర పోషించానన్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని