ఇసుక ప్రైవేటీకరణపై భాజపా నిరసన
close

తాజా వార్తలు

Updated : 23/03/2021 15:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇసుక ప్రైవేటీకరణపై భాజపా నిరసన

తిరుపతి: ఇసుక ప్రైవేటీకరణను నిరసిస్తూ భాజపా నేతలు తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఇసుకను కిలోల లెక్కన తూకం వేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఇసుక టెండర్లను రద్దు చేయాలని నినాదాలు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ నేతలు ఆదినారాయణ రెడ్డి, భానుప్రకాశ్‌రెడ్డి పెద్దసంఖ్యలో కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎలాంటి ఆందోళనలు చేయొద్దని పోలీసులు నోటీసులిచ్చినా.. పట్టించుకోకుండా భాజపా నేతలు నిరసన కొనసాగించారు. ఇసుక టెండర్లను బినామీ సంస్థకు కట్టబెట్టి సంపద దోచుకోవాలన్నదే ప్రభుత్వ ప్రయత్నం అని  సోము వీర్రాజు మండిపడ్డారు. 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని