Covid మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: బండి
close

తాజా వార్తలు

Updated : 29/04/2021 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: బండి

హైదరాబాద్‌: కరోనా కట్టడిలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడంలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వెంటనే ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 

‘‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారా? వ్యాక్సిన్‌ తీసుకోవాలని ప్రజలకు ఎందుకు చెప్పలేదు. రాష్ట్రానికి ఆక్సిజన్, వ్యాక్సిన్ ఎంతకావాలో స్పష్టత లేదు. ప్రభుత్వం కొవిడ్ మరణాలు, పాజిటివ్ కేసుల సంఖ్యను తగ్గించి చూపిస్తోంది. ప్రభుత్వం తప్పుడు లెక్కల ప్రకటనల వల్లే ప్రజలు కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారు. కొవిడ్‌ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. పీఎం కేర్‌ నిధుల గురించి పూర్తి నివేదిక ఇచ్చాం. సీఎం కేర్‌ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. భాజపా సలహాలు, సూచనలు తీసుకోవాలి. రాష్ట్రంలో కరోనా మరణాలు, పాజిటివ్‌ కేసులకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా కేంద్రానికి నివేదిక ఇస్తే కేంద్రం ఆదుకుంటుంది’’ అని బండి సంజయ్‌ అన్నారు. 

వరంగల్‌, ఖమ్మంతోపాటు సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారం చేశానని.. ప్రజల అభిమానం చూస్తుంటే అత్యధిక స్థానాల్లో భాజపా గెలుస్తుందని అర్థమవుతోందని బండి సంజయ్‌ అన్నారు. అధికార పార్టీ అవినీతి అక్రమాలతో కార్పొరేషన్‌ ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు. క్రిమినల్స్ పట్ల డీజీపీ కఠినంగా వ్యవహారించాలని బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని