close

తాజా వార్తలు

Updated : 09/02/2021 21:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రేటర్‌ మేయర్‌ ఎన్నికలో భాజపా పోటీ

వెల్లడించిన ఎమ్మెల్సీ రామచందర్‌రావు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికలో భాజపా పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు స్పష్టం చేశారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ అభ్యర్థులను నిలబెడతామని చెప్పారు. భాజపాకు మేయర్ పదవి ఇవ్వాలనే నగర ప్రజలు 48 స్థానాల్లో విజయం కట్టబెట్టారన్నారు. భాజపా, తెరాస మధ్యకొన్ని వేల ఓట్ల తేడా మాత్రమే ఉందని చెప్పారు. మేయర్‌ ఎన్నికలో గెలుపు, ఓటమితో సంబంధం లేదన్నారు. మజ్లిస్‌ పోటీ పడుతుందో లేదో తెలియదని.. అది ఆ పార్టీ వ్యక్తిగత వ్యవహారమని చెప్పారు. తెరాస, మజ్లిస్‌ మధ్య స్నేహం ఉందని.. ప్రజలను పక్కదారి పట్టించేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని రామచందర్‌రావు ఆరోపించారు.

ఇవీ చదవండి..

ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీకాంగ్రెస్‌

అమిత్‌షాతో పవన్‌కల్యాణ్‌ భేటీ



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని