బెంగాల్‌లో భాజపానే గెలుస్తుంది: దిలీప్‌ ఘోష్‌
close

తాజా వార్తలు

Published : 02/05/2021 11:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెంగాల్‌లో భాజపానే గెలుస్తుంది: దిలీప్‌ ఘోష్‌

కోల్‌కతా: బెంగాల్‌లో అత్యధిక స్థానాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ దూసుకుపోతున్న తరుణంలో ఆ రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. లెక్కింపు సరళి తుది ఫలితాలను నిర్ణయించదని అభిప్రాయపడ్డారు. ఇంకా కౌంటింగ్‌ కొనసాగుతోందని.. భాజపాయే గెలుస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో టోలిగంజ్‌ నియోజకవర్గంలో వెనుకంజలో ఉండడంపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పుడప్పుడే తుది పలితాలపై ఏమీ చెప్పలేమని.. సాయంత్రానికి మ్యాజిక్‌ మార్క్‌ చేరుకుంటామన్నారు. అంతిమంగా భాజపాయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

యావత్తు దేశాన్ని ఆకర్షించిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. తృణమూల్‌ 189 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. భాజపా 94 సీట్లలో ముందంజలో ఉంది. వామపక్షాలు కేవలం 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అయితే నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ మాత్రం భాజపా అభ్యర్థి సువేందు అధికారి కంటే వెనుకంజలో ఉండడం గమనార్హం. 292 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి 147 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంటుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని