వైకాపాకు చెక్‌పెట్టే పార్టీ భాజపానే: సోము
close

తాజా వార్తలు

Published : 06/03/2021 14:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపాకు చెక్‌పెట్టే పార్టీ భాజపానే: సోము

కడప: వైకాపా ప్రభుత్వానికి చెక్‌పెట్టే ఏకైక పార్టీ భాజపానే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప విచ్చేసిన ఆయన.. నగరంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ భాజపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో  అధికారపార్టీ నేతలు, ఎమ్మెల్యేలకు అధికారులు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు మొదలుకొని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ శాఖ మొత్తం అధికార పార్టీకి వత్తాసు పలుకుతోందన్నారు. రిటర్నింగ్‌ అధికారులు, పోలీసులు ఇష్టానుసారంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో 151 ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. ప్రజామద్దతు లేకనే ఇలాంటి దొడ్డిదారి పనులు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ జగన్‌ పేరుతో ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో భాజపా అభ్యర్థుల గెలుపు సాధ్యమని సోమువీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని