‘వకీల్‌సాబ్‌ బెనిఫిట్‌ షో ఎందుకు రద్దు చేశారు?’
close

తాజా వార్తలు

Published : 09/04/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌సాబ్‌ బెనిఫిట్‌ షో ఎందుకు రద్దు చేశారు?’

తిరుపతిలో భాజపా శ్రేణుల నిరసన

తిరుపతి: నగరంలోని జయశ్యామ్‌ థియేటర్‌ వద్ద భాజపా శ్రేణులు నిరసనకు దిగాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌సాబ్‌’ సినిమా బెనిఫిట్‌ షోలు రద్దు చేశారంటూ భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌, ఆ పార్టీ నేత భానుప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సునీల్‌ దేవ్‌ధర్‌ మాట్లాడుతూ వకీల్‌సాబ్‌ బెనిఫిట్‌ షోలు ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. పవన్‌కే కాకుండా ఆయన సినిమాకూ సీఎం జగన్‌ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని