close

తాజా వార్తలు

Published : 11/02/2021 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మేం చెప్పిందే జరిగింది: బండి సంజయ్‌

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలో తెరాసకు మద్దతివ్వడం ద్వారా ఎంఐఎం-తెరాస పార్టీల మధ్య పొత్తు మరోసారి బహిర్గతమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆ రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకునేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికపై స్పందించిన బండి సంజయ్‌.. ఆ రెండు పార్టీల ఒప్పందంపై భాజపా చెప్పిందే జరిగిందన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

తెరాస, ఎంఐఎం కలిసి పోటీ చేయకపోయుంటే తెరాస ఒక్క స్థానంలోనూ గెలిచేది కాదన్నారు. పూర్తిగా మతతత్వ పార్టీ అయిన ఎంఐఎంకు తెరాస మద్దతు ఉందని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ఇకపై జీహెచ్‌ఎంసీలో తెరాస స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రెండు పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీల నేతలు చెప్పారని.. నీతివంతమైన రాజకీయం చేయాలంటే బహిరంగంగానే పొత్తు పెట్టుకోవాలని హితవు పలికారు. భాజపా కార్పొరేటర్లు హైదరాబాద్‌ను కంటికిరెప్పలా కాపాడుకుంటారని.. పైసా అవినీతి జరిగినా ప్రశ్నిస్తామన్నారు.

ఇవీ చదవండి..

హైదరాబాద్‌ మేయర్‌గా విజయలక్ష్మీ
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని