
తాజా వార్తలు
బెదిరింపు కాల్స్ వస్తున్నాయి: బొండా ఉమా
అమరావతి: గుంటూరు పోలీసులు వైకాపా కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఉదయం తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మాచర్ల ఘటనలో అనామకులపై కేసులు పెట్టి తమను విచారణకు రావాలని నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దాడి చేయించిన పిన్నెల్లి, వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేయలేదని, ఇప్పటికీ తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వివరించారు. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని, గుంటూరు పోలీసులపై తమకు నమ్మకం లేదన్నారు. అక్రమ కేసులతో తెదేపా శ్రేణులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఉమా ఆరోపించారు.
Tags :
జిల్లా వార్తలు