close

తాజా వార్తలు

Published : 05/02/2021 16:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘బుక్‌ మై షో’ నుంచి స్ట్రీమింగ్‌ సేవలు

దిల్లీ: ఆన్‌లైన్‌లో మూవీ టికెట్లు విక్రయించే బుక్‌ మై షో సంస్థ స్ట్రీమింగ్‌ సేవలను ప్రారంభించింది. పే పర్‌ వ్యూ, సినిమా పూర్తిగా కొనుక్కోవడం, అద్దెకు తీసుకునే  (వీడియో ఆన్‌ డిమాండ్‌) సేవలను ప్రారంభించింది. 600 సినిమాలు, 72 వేల గంటల కంటెంట్‌తో ఈ స్ట్రీమింగ్‌ సేవలను తీసుకొచ్చింది. దేశీయ సినిమాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలను సైతం తమ స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫాంపై అందుబాటులో ఉంటాయని బుక్‌ మై షో ఓ ప్రకటనలో తెలిపింది.

నిర్ణీత సమయంలో మూవీని వీక్షించేందుకు అద్దెకు తీసుకోవడం, లేదంటే పూర్తి సినిమాను కొనుగోలు చేసి ఎప్పుడైనా వినియోగించుకునే వెసులుబాటునూ యూజర్లకు కల్పిస్తున్నట్లు బుక్‌ మై షో పేర్కొంది. రూ.40 నుంచి రూ.700 వరకు వీటి ధరలు ఉంటాయని పేర్కొంది. సోనీ పిక్చర్స్‌, వార్నర్‌ బ్రదర్స్‌, యూనివర్సల్‌ పిక్చర్స్‌ వంటి విదేశీ దిగ్గజ ప్రొడక్షన్‌ కంపెనీలతో పాటు దేశీయ ప్రొడక్షన్‌ హౌజ్‌లైన వయాకామ్‌ 18, షేమరూ, రాజశ్రీ ప్రొడక్షన్స్‌ తదితర వాటితో ఒప్పందం చేసుకున్నట్లు బుక్‌ మై షో సీఓఓ ఆశిష్‌ సక్సేనా పేర్కొన్నారు. బుక్‌ మై షో మొబైల్‌ యాప్‌ ద్వారా గానీ, వెబ్‌సైట్‌ ద్వారా గానీ ఈ స్ట్రీమింగ్‌ సేవలను పొందొచ్చని తెలిపారు. యాపిల్‌ టీవీ, ఆండ్రాయిడ్‌ టీవీ, ఫైర్‌ స్టిక్‌, క్రోమ్‌ క్యాస్ట్‌, డెస్క్‌ టాప్‌ బ్రౌజర్స్‌ ద్వారా కూడా స్ట్రీమింగ్‌ సేవలు ఆస్వాదించొచ్చని వెల్లడించారు.

ఇదీ చదవండి..
నెట్‌ఫ్లిక్స్‌.. సమయానికి ఆపేయొచ్చు!



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని