close
Array ( ) 1

తాజా వార్తలు

మూడు రాజధానులు అందుకే.. : బొత్స

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో సీఆర్‌డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. అనంతరం సభలో మాట్లాడుతూ  సీఆర్‌డీఏను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చిందో వివరించారు. ‘ప్రాంతీయ అసమానతల వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగింది. కొత్తగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజధాని కోసమని సీఆర్‌డీఏ చట్టం చేశారు. గత ప్రభుత్వం అసమానతలు తొలగించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. మళ్లీ ఒకే ప్రాంతంలో పరిపాలన కేంద్రీకరిస్తూ.. ఇతర ప్రాంతాలవారి అవసరాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా బేరీజు వేసుకోకుండా గత ప్రభుత్వం ముందుకు వెళ్లింది.’ అని బొత్స అన్నారు

‘రాష్ట్రానికి రాజధాని ఎక్కడ ఉండాలన్న అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ చేసిన సిఫార్సులను అప్పటి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఆ రోజు సభలో బలముందని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి అంటే 13 జిల్లాల అభివృద్ధి అని.. 5 కోట్ల మంది అభివృధ్ది  చెందాలని ఈ బిల్లును తీసుకొచ్చాం’ అని బొత్స స్పష్టంచేశారు. 

‘బోస్టన్‌ కమిటీ, జీఎన్‌ రావు ఇచ్చిన నివేదికలపై హైపవర్‌ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర అభివృద్ధి ధ్యేయంతో.. కొన్ని సూచనలను కమిటీ ప్రభుత్వానికి చేసింది. సమతుల అభివృద్ధితోపాటు పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కమిటీ పేర్కొంది.  దాంతోపాటు పరిమితమైన వనరులు, ఆర్థిక పరమైన ఒత్తిడుల నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని, ఆ  వనరులన్నీ ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం కాకుండా.. 13 జిల్లాలకు వాటి ఫలాలు అందాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దాని ప్రకారం సీఆర్‌డీఏను రద్దు చేస్తున్నాం. సీఆర్‌డీఏ కోసం భూమిలిచ్చిన రైతులకు అన్యాయం చేయకుండా.. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉన్నాం. దానికంటే మిన్నగా రైతులకు ఇవ్వాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది’’ అని చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.