అప్పగింతల్లో ఏడ్చిఏడ్చి.. వధువుకు గుండెపోటు
close

తాజా వార్తలు

Published : 06/03/2021 13:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అప్పగింతల్లో ఏడ్చిఏడ్చి.. వధువుకు గుండెపోటు

భువనేశ్వర్‌: అప్పటిదాకా పెళ్లి వేడుకలతో కళకళలాడిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పుట్టింటిని వదల్లేక అప్పగింతల సమయంలో ఎక్కువగా ఏడ్చి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిందో నవ వధువు. ఈ విషాద ఘటన ఒడిశాలోని సోనేపుర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

జులుందా గ్రామానికి చెందిన గుప్తేశ్వరి సాహూ అలియాస్‌ రోజీకి బాలాంగిర్‌ జిల్లా తెటెల్‌గావ్‌ గ్రామానికి చెందిన బిశికేశన్‌తో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వేడుకల అనంతరం వధువు కుటుంబసభ్యులు కూతుర్ని అత్తవారింటికి సాగనంపేందుకు ‘బిదాయి(అప్పగింతలు)’ జరుపుతుండగా.. రోజీ ఏడుస్తూనే ఉంది. అలా ఏడ్చిఏడ్చి ఉన్నట్టుండి కుప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో రోజీ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని