గుండెపోటుతో అన్న.. జీర్ణించుకోలేక తమ్ముడు
close

తాజా వార్తలు

Updated : 01/07/2020 10:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గుండెపోటుతో అన్న.. జీర్ణించుకోలేక తమ్ముడు

జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌ కోచ్‌, అతని సోదరుడు మృతి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: గుండెపోటుతో జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌ కోచ్‌ మరణించగా.. ఆయన మృతదేహాన్ని చూసిన అతని తమ్ముడు అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. అన్నదమ్ముల అంత్యక్రియలు ఒకేసారి చేయాల్సి రావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రం సిద్ధాంతిలో మంగళవారం చోటుచేసుకుంది. సిద్ధాంతికి చెందిన రాచమల్ల సుదర్శన్‌(55) జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌ విభాగంలో కోచ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గతంలో గుండెపోటు రావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. జూన్‌ 29న సుదర్శన్‌ విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలో అస్వస్థతకు గురయ్యాడు. తోటి ఉద్యోగి సాయంతో ఇంటికి చేరుకున్నాడు. రాత్రి మరోసారి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న సుదర్శన్‌ తమ్ముడు లవణ్‌(32)కు సమాచారం ఇవ్వగా.. వెంటనే ఇంటికి వచ్చేశారు. తల్లిదండ్రులు మరణించిన నాటి నుంచి బాగోగులు చూసిన అన్న మృతదేహాన్ని చూసి జీర్ణించుకోలేక లవణ్‌ కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. సుదర్శన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. లవణ్‌కు వివాహం కాలేదు. అన్నదమ్ములు ఇద్దరూ మృతి చెందటం బస్తీ వాసుల హృదయాలను కలచివేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని