భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దు భద్రతా దళాల సమావేశం

తాజా వార్తలు

Published : 22/06/2021 22:55 IST

భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దు భద్రతా దళాల సమావేశం

దిల్లీ: భారత్‌, బంగ్లాదేశ్ సరిహద్దు భద్రతా దళాల(బీఎస్‌ఎఫ్‌) సమన్వయ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. మూడురోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశం గురువారంతో ముగియనుందని అధికారులు వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సరిహద్దును సమర్థంగా నిర్వహించడంలో భాగంగా అక్కడ జరిగే నేరాలు, అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు చర్యలు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. పరస్పర సమన్వయంతో గస్తీ నిర్వహించడం, సాంకేతిక సహకారం, ప్రమాదకర ప్రాంతాల గుర్తింపు తదితర అంశాలకు సంబంధించి సరిహద్దు నిర్వహణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ఇరు దేశాల ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకొని.. సరిహద్దులో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇరు దేశాల భద్రతా దళాల మధ్య మైత్రిని పెంపొందించడం కూడా ఇందులో భాగమన్నారు. 

ఇలాంటి సమావేశం నిర్వహించడం ఈ నెలలో ఇది రెండోసారి. ఈ నెల 7న ప్రారంభమైన సరిహద్దు సమన్వయ సమావేశం నాలుగు రోజులపాటు నిర్వహించిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని