బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 23/03/2021 11:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

మేడ్చల్‌: మేడ్చల్‌ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని చంద్రిక ఆత్మహత్యకు పాల్పడింది. చంద్రిక స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతోంది. కళాశాల సమీపంలో ఉన్న కృపా ప్రైవేటు వసతి గృహంలో ఉంటోంది. వసతిగృహం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో చంద్రిక మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్‌ టీం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు.  వసతిగృహం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. 

విద్యార్థిని చంద్రిక ఫిబ్రవరి 4న వసతిగృహాంలో చేరి.. పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని మృతికి వివరాలు తెలియరాలేదని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 


 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని