ఈ నెల 29 నుంచి బడ్జెట్‌ సమావేశాలు!
close

తాజా వార్తలు

Published : 05/01/2021 18:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ నెల 29 నుంచి బడ్జెట్‌ సమావేశాలు!

దిల్లీ: పార్లమెంట్‌ వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ ఉపసంఘం నిర్ణయించినట్లు సమాచారం. తొలి విడతగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, అనంతరం మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8 వరకు రెండో విడతగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థికశాఖ సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రముఖ ఆర్థిక నిపుణులు, వాణిజ్యవేత్తలతో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ భేటీ అయ్యారు. అయితే పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణపై కేంద్ర కేబినెట్‌ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వార్షిక బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో 29న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని