
తాజా వార్తలు
ఛైర్మన్‌ను చంద్రబాబు ప్రభావితం చేశారు:బుగ్గన
అమరావతి: ఏపీ శాసన మండలిలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదో దుర్దినం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను నిబంధనలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్యం, చట్టసభలపై ఏమాత్రం గౌరవం లేకుండా సభలో తెదేపా వ్యవహరించిందన్నారు. మండలి గ్యాలరీల్లో తెదేపా అధినేత చంద్రబాబు కూర్చొని ఛైర్మన్ షరీఫ్‌ను ప్రభావితం చేశారని బుగ్గన ఆరోపించారు. ఛైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి సెలెక్ట్ కమిటీకి పంపేలా చేశారని మండిపడ్డారు.
అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం తాపత్రయ పడ్డారని, 13 జిల్లాలను జోన్ల వారీగా అభివృద్ధి చేసేందుకు వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చామని బుగ్గన అన్నారు. ఎంతో మథనం, ఎన్నో కమిటీల అధ్యయనం తర్వాత అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శాసనసభ నుంచి మండలికి ఆమోదం కోసం పంపితే తొలి నుంచీ తెదేపా నేతలు అడ్డుతగిలారన్నారు. స్పీకర్‌గా,
మంత్రిగా పనిచేసిన యనమల నిబంధనలకు వ్యతిరేకంగా బిల్లులను పాస్ కానీ రిజక్ట్ గానీ చేయకుండా సెలెక్ట్ కమిటీ పంపారని బుగ్గన అన్నారు. బిల్లులను తిరిగి అసెంబ్లీకి పంపకూడదనే దురుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయాన్ని విస్మరించారన్నారు. ఇంతటి అధ్వాన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఇది చాలా అన్యాయమన్నారు. బిల్లు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో చెప్పాలే తప్ప.. పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- మహా నిర్లక్ష్యం
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- గబ్బాలో కొత్త హీరోలు
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
ఎక్కువ మంది చదివినవి (Most Read)
