లారీని ఢీకొన్న బస్సు..ఒకరి మృతి
close

తాజా వార్తలు

Updated : 15/03/2021 11:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లారీని ఢీకొన్న బస్సు..ఒకరి మృతి

సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం జాతీయ రహదారి సమీపంలో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని నవరంగ్‌పూర్‌ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్‌ సుధీర్‌ సగారియా(37) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. కాగా, వీరిలో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరంతా ఒడిశాకు చెందిన వారే. క్షతగాత్రులకు సోంపేట మండలంలోని బారువ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం బ్రహ్మపుర వైద్యశాలకు తరలించారు. పొగమంచు వల్ల లారీ కనిపించకపోవడమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బారువ ఎస్సై శివనారాయణ తెలిపారు.  


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని