కూలీలతో వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తా
close

తాజా వార్తలు

Published : 26/11/2020 23:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కూలీలతో వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తా

పూసపాటిరేగ: కూలీలతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడడంతో 13 మంది గాయపడ్డారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని బరంపురం నుంచి 50 మంది కూలీలు ఉపాధి కోసం కేరళ రాష్ట్రానికి బయల్దేరారు. ఈ క్రమంలో మండలంలోని చోడమ్మ అగ్రహారం వద్దకు రాగానే జాతీయ రహదారిపై బస్సును పక్కకు నిలిపాలని కూలీలు కోరారు. డ్రైవర్‌ బస్సును పక్కకు నిలిపే క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అందులో 13 మందికి గాయాలు కాగా, వారిలో ఇద్దరికి కాలు, చేయి విరిగాయి. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలైన ఇద్దరిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సీఐ శ్రీధర్‌, ఎస్సైలు జయంతి, మహేశ్‌, మోహనరావు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని