సాగర్‌లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు
close

తాజా వార్తలు

Updated : 30/03/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాగర్‌లో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు

నాగార్జున సాగర్‌: నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు నిడమనూరు తహసీల్దార్‌ కార్యాలయంలో నామినేషన్‌ వేశారు. నాగార్జున సాగర్‌ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ అధికార పార్టీ తెరాస అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ వేయడానికి తెరాస నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లారు. అభ్యర్థి భగత్‌ వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌,మహమూద్‌ అలీ తదితరులు ఉన్నారు.  

కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలో నిలిచిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జానారెడ్డి నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడం ప్రజస్వామ్యానికి హాని చేస్తుందన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెదేపా తరఫున మువ్వా అరుణ్‌కుమార్‌, భాజపా అభ్యర్థిగా పానుగోతు రవికుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. రవికుమార్‌ తమ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి వెళ్లి నామినేషన్‌ వేశారు.

భాజపాకు ఎదురుదెబ్బ
నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా భాజపా టికెట్‌ ఆశించి భంగపడిన ఆ పార్టీ నేత కడారి అంజయ్య తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ తనకు ఇవ్వకపోవడంతో నిరాశకు గురైన అంజయ్య ఇవాళ సీఎం కేసీఆర్‌ను కలవనున్నట్లు సమాచారం. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని