రాజధాని ఉద్యమంలో మరో రైతు మృతి
close

తాజా వార్తలు

Published : 30/12/2020 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధాని ఉద్యమంలో మరో రైతు మృతి

అమరావతి : రాజధాని ఉద్యమంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయారు. తుళ్లూరు మండలం మందడంలో బుధవారం ఉదయం మాదాల రామారావు(80) గుండెపోటుతో మృతి చెందారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రకటించిన రాజధాని అమరావతి నిర్మాణానికి రామారావు 20 ఎకరాల భూమి ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రాజధాని రైతులు దాదాపు 400 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. 

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. రాజధాని తరలిపోతుందని గత కొంతకాలంగా రామారావు మానసికంగా వేదన పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇవీ చదవండి..
తల్లిదండ్రులపై కుమారుడి దాడి..తల్లి మృతి

అమెరికాలోనూ కొత్తరకం వైరస్‌!

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని