కాల్వలోకి కారు.. ముగ్గురి గల్లంతు
close

తాజా వార్తలు

Updated : 12/03/2021 11:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాల్వలోకి కారు.. ముగ్గురి గల్లంతు

ఆత్రేయపురం: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆత్రేయపురం మండలం లొలాకుల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాల్వలో రెండు మృతదేహాల్ని గుర్తించారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. 

పోలీసుల కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన ముందిటి సురేష్‌ వర్మ(36), చింతలపాటి శ్రీనివాస్‌రాజు(46), ఇందుకూరి వెంకటసత్యనారాయణరాజు, ముదునూరి వెంకటగణపతిరాజు, మున్నింటి సీతారామరాజు ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. మహా శివరాత్రి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడలో బంధువులు ఉండటంతో శివరాత్రి వేడుకలకు గురువారం వచ్చారు. వీరంతా ఈ తెల్లవారుజామున తిరిగి కారులో వెళ్తుండగా...లొల్లాకుల మలుపు వద్దకు వచ్చేసరికి మంచు కారణంగా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వీరిలో వెంకటగణపతిరాజు, సీతారామరాజు సురక్షితంగా బయటపడగా.. మిగిలిన ముగ్గురు కాలువలో గల్లంతయ్యారు. సురేష్‌ వర్మ, శ్రీనివాస్‌రాజుల మృతదేహాలు లభ్యం కాగా, వెంకటసత్యనారాయణరాజు కోసం గాలింపు చేపట్టారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని