‘కేరింత’ హీరోపై కేసు నమోదు
close

తాజా వార్తలు

Published : 20/01/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘కేరింత’ హీరోపై కేసు నమోదు

జూబ్లీహిల్స్‌‌‌: కేరింత ఫేమ్‌ విశ్వంత్‌ సహా మరో ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. తక్కువ ధరకు కార్లు ఇప్పిస్తానని మోసగించినట్లు బాధితులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న రెడ్డి రామకృష్ణ అనే వ్యాపారి 2017లో కారు కొనాలనుకున్నాడు. 30శాతం తక్కువ ధరకు ఇన్నోవా కారు ఇప్పిస్తామని నటుడు విశ్వంత్‌, అతడి తండ్రి లక్ష్మీకుమార్ అలియాస్ సాయిబాబా వ్యాపారికి చెప్పారు. తమకు బంజారాహిల్స్‌లోని ఓ‌ ఇంటీరియర్స్ షోరూం అధినేత ఆత్మకూరు ఆకాశ్‌ గౌడ్‌ తెలుసునని, అతడి ద్వారా తక్కువ ధరకే కారు ఇప్పిస్తామని వ్యాపారిని నమ్మించారు. ఇదంతా నమ్మిన వ్యాపారి.. లక్ష్మీకుమార్‌కు అడ్వాన్స్‌గా రూ.10లక్షలు చెల్లించాడు. మరో నెల రోజుల తర్వాత రూ.2.50 లక్షలు చెల్లించాడు. అనంతరం కారును వ్యాపారికి అందించిన లక్ష్మీకుమార్.. వాహనాన్ని మాత్రం వ్యాపారి పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేయలేదు. 

ఈ క్రమంలోనే అదే కారుపై ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.20లక్షలు అప్పు తీసుకున్నట్లు వ్యాపారి తెలుసుకున్నాడు. ఎన్ని సార్లు అడిగినా విశ్వంత్‌, అతడి తండ్రి డబ్బు తిరిగివ్వకుండా తప్పించుకుని తిరుగుతుండడంతో చేసేది లేక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు ఆకాశ్‌ గౌడ్‌, లక్ష్మీ కుమార్, నటుడు విశ్వంత్‌పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి..

వాట్సాప్‌.. ఆ పాలసీ వెనక్కి తీసుకో: కేంద్రం

ఇంగ్లాండ్‌ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని