మంథని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై కేసు నమోదు
close

తాజా వార్తలు

Published : 07/04/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మంథని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌పై కేసు నమోదు

పెద్దపల్లి: మంథని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పుట్ట శైలజపై కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలతో ఆమెపై మంథని పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాది వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసు విచారణలో భాగంగా ఈ నెల 19న నిందితుడు బిట్టు శ్రీనును మంథని కోర్టుకు తీసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శైలజ.. బిట్టు శ్రీనుతో వీడియో కాల్‌ మాట్లాడించినట్లు అప్పుడు విధుల్లో ఉన్న ఎస్సై ప్రవీణ్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. వారించినా వినకుండా నిందితుడితో ఫోన్ మాట్లాడించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మంథని న్యాయస్థానం ఆదేశాలతో సెక్షన్ 186 కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని